హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి పొన్నంతో కలిసి కలెక్టర్ ఏరియల్ సర్వే
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నగరంలో జరుగుతున్న గణేశ్ శోభాయాత్ర మరియు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు వారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ హైదరాబాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.