కల్వకుర్తిలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు కల్వకుర్తి టౌన్ లోని సావిత్రిబాయి పూలే ఒకేషనల్ జూనియర్ కళాశాలలో షీ టీమ్ బృందం ఆధ్వర్యంలో ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం, మహిళా ట్రాఫికింగ్ మరియు సైబర్ నేరాల వంటి కీలక అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ పేర్కొన్నారు. ఈ సదస్సులో విద్యార్థినులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.