దిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా దిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరినట్లు వర్గాలు వెల్లడించాయి.