'తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానం': స్పీకర్‌పై అసభ్య పదజాలంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత పదజాలం వాడటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి, నాలుగు కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని మండిపడ్డారు. సభాపతి అంటే ఒక వ్యక్తి కాదని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ఈ దాడిని తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.