కలువాయిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన: పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కలువాయి
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కలువాయి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అజీత వెజెండ్ల బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్ లో ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. భద్రతా సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు.