నర్సీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లు తిరస్కరిస్తున్నారని వైకాపా ఆరోపణ
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పక్షపాత ధోరణితో సాగుతోందని వైకాపా నేతలు తీవ్రంగా ఆరోపించారు. మొదట ఆమోదించిన నామినేషన్లను సాయంత్రం సమయంలో అకారణంగా తిరస్కరించినట్లు ప్రకటించడంపై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.