రాష్ట్రస్థాయిలో ఉత్తమ హరిత హోటల్గా ఎంపికైన జన్నారం రిసార్ట్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్కు రాష్ట్రస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రాంత విభాగంలో ఉత్తమ హరిత హోటల్గా ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని శిల్పారామం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా మేనేజర్ వీరేంద్ర కుమార్ ప్రశంసా పత్రం అందుకున్నారు.