నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన అథ్లెట్ తాన్యా చౌదరి

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

భారతీయ అథ్లెటిక్స్ సిరీస్ ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్ అథ్లెట్ తాన్యా చౌదరి మహిళల హ్యామర్ త్రోలో అద్భుతం సృష్టించారు. 68.35 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. ఆసియా క్రీడలకు ముందు ఈ రికార్డు సాధించడం భారత జట్టుకు పెను ఉత్సాహాన్నిచ్చింది. గతంలో అనుష్క యాదవ్ పేరు మీద ఉన్న 67.02 మీటర్ల రికార్డును తాన్యా బద్దలు కొట్టారు.