వీడియో కాల్ ద్వారా ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నాగబాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీ కడుతూ ప్రాణాలు కోల్పోయిన అభిమాని ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఆయన, రూ. రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పవన్ అభిమాని మృతి పట్ల నాగబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.