ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
రిపోర్టర్: మహేష్
స్థలం: India
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెట్ల కఠిన శ్రమ, అంకితభావం దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. పల్లోమా మిజుహో స్టేడియంలో జరిగిన అట్టహాస వేడుకల్లో ఒలింపిక్ పతక విజేత మను భాకర్, కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ భారత్ తరఫున త్రివర్ణ పతాకాన్ని చేతబూని పరేడ్‌కు నేతృత్వం వహించారు. ఆదివారం నుంచి భారత క్రీడాకారులు తమ పతకాల వేటను అధికారికంగా ప్రారంభించనున్నారు.