విజయవాడ మేయర్ పీఠం కోసం కూటమిలో తీవ్ర పోటీ
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమిలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి మేయర్ సీటు కేటాయించే దిశగా కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీసినట్లు సమాచారం.