గాయంతో మంచానికే పరిమితమైన అంతర్జాతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరోజా

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

అంతర్జాతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరోజా ఇటీవల తీవ్ర గాయం కారణంగా పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. రొమేనియాలో టోర్నమెంట్ సందర్భంగా అడుగు జారిపడి చీలమండం గాయపడటంతో మంచంపైనే ఉంటూ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ అనుభవం చాలా అసహ్యకరంగా ఉండేదని, ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన వెల్లడించారు. భారతీయ అభిమానుల స్పందన చాలా బాగుందని ప్రశంసించారు.