రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో వంద పట్టణ స్థానిక సంస్థలు మరియు వేలాది పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు వెల్లడించాయి. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుందని, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఎన్నికలు పూర్తి చేసి కొత్త ఏడాది నాటికి కొత్త పాలకవర్గాలను కొలువుదీర్చేందుకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది.