ఉద్యోగులకు తీపి కబురు: తెలంగాణ ప్రభుత్వంచే రెండు డీఏల మంజూరు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. అక్టోబర్ నెల జీతంతో పాటు ఈ పెంచిన డీఏ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు. 2024 జనవరి మరియు జులై డీఏలను విడుదల చేశామని, పెండింగ్ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో వివిధ పే స్కేళ్ల ఉద్యోగులతో పాటు యూజీసీ, ఏఐసీఐఐ ఉద్యోగులకు సైతం ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.