గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి: ఆల వెంకటేశ్వర్ రెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: మహబూబ్ నగర్

త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకద్రలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి నాయకుడు బాధ్యత తీసుకొని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. గత ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.