మద్యపాన నిషేధానికి ఆదర్శం: పల్నాడు జిల్లాలోని ఆ పదకొండు పల్లెలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పల్నాడు
మద్యపాన నిషేధం అమలులో పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని పదకొండు పల్లెలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో, గతంలో దినపత్రిక ఇచ్చిన పిలుపుతో ఆ గ్రామాల ప్రజలంతా ఏకమయ్యారు. దశాబ్దాల క్రితం ఊరంతా కలిసి విధించుకున్న మద్యనిషేధ కట్టుబాట్లను నేటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే గ్రామ కమిటీలు విధించే జరిమానాలకు కట్టుబడి ఉండాల్సిందే.