ఆమదాలవలస నూరాని మసీదులో ఘనంగా జష్నే గౌసుల్ వరా వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆమదాలవలస

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వరదావరి క్వార్టర్స్ లో ఉన్న నూరాని మసీదులో ఆదివారం సాయంత్రం జష్నే గౌసుల్ వరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు నుంచి ముస్లిం కాలనీ వరకు భారీ ఊరేగింపు నిర్వహించి జెండా ఎగురవేశారు. ఒడిశా ఇస్లామిక్ పండితుడు మౌలానా అస్గర్ అలీ మిస్బాహి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫాతియా, లంగర్ ఏర్పాట్లు చేశామని మసీదు సెక్రటరీ షేక్ అబ్బు రహీం తెలిపారు.