కొత్తవి వద్దు ఉన్నవి రద్దు: కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నదుల్లో నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోయలేని అసమర్థత రాష్ట్రంలో నెలకొందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దూరదృష్టితోనే సిద్దిపేట అభివృద్ధి చెందిందని, ప్రస్తుత పాలనలో రేవంత్ రెడ్డి కృత్రిమ కరువును సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.