ఎల్నినో ముప్పు: తాగునీరు, విద్యుత్ కొరతపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ఎల్నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉమ్మడి జిల్లాల ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, తాగునీరు మరియు విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపుతో పాటు థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచాలని సీఎస్ పేర్కొన్నారు.