గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి.. కాశీబుగ్గ డీఎస్పీ టి భవాని హెచ్చరిక

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కాశీబుగ్గ డిఎస్పి టి భవాని స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సమావేశంలో కీలక నిబంధనలు జారీ చేశారు. రోడ్లపై ప్రజలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, రాత్రి 10 గంటల తర్వాత డీజేలు నిషేధమని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద వాలంటీర్లు ఉండాలని, బలవంతపు చందాలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.