నాగార్జున కల్ట్ క్లాసిక్ గీతాంజలి చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
అక్కినేని నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత ప్రేమకావ్యం గీతాంజలి చిత్రం నవంబర్ 13వ తేదీన థియేటర్లలో మరోసారి రీ-రిలీజ్ కానుందని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్లాసిక్ సినిమా మ్యాజిక్ను పెద్ద తెరపై అనుభూతి చెందాలని చిత్రబృందం పేర్కొంది. గతంలో వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేయడంతో నాగార్జున అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.