బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందంటూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధీమా
రిపోర్టర్: రాము
స్థలం: సిరికొండ
అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం సిరికొండ మండలం పొన్న గ్రామంలో కోటీ పదిహేడు లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.