తోటి జర్నలిస్టుకు అండగా నిలిచిన పలాస జర్నలిస్ట్ అసోసియేషన్
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
అనారోగ్యంతో బాధపడుతున్న తోటి జర్నలిస్టు మేఘనకు పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించి, బాధితురాలికి భరోసానిచ్చారు. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమే సంఘ బాధ్యత అని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.