పిఠాపురంలో రూ.6 కోట్లతో చెరువుల సుందరీకరణ చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పిఠాపురం

పిఠాపురం నియోజకవర్గంలో రూ.6 కోట్ల వ్యయంతో 11 చెరువుల సుందరీకరణ పనులను జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ఆయన తాజాగా అధికారికంగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు ఆహ్లాదకరంగా, ఆరోగ్య నిలయాలుగా మారుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.