శ్రీనగర్లో దశాబ్దాల తర్వాత అట్టహాసంగా ఇరానీ కప్ మ్యాచ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీనగర్

జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ స్టేడియంలో దశాబ్దాల విరామం తర్వాత దేశవాళీ రికార్డుల ప్రదర్శనగా ఇరానీ కప్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ మాజిద్ దార్ తెలిపారు. ఈ చారిత్రక వేడుక కోసం బీసీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. లోయలో క్రికెట్ ప్రేమికులకు ఇది చారిత్రక క్షణమని, స్టేడియం సీటింగ్ సామర్థ్యాన్ని ఐదు వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. మ్యాచ్కు హాజరయ్యే ప్రేక్షకులకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన వివరించారు.