నెల్లూరు జిల్లాలో బియ్యం ధరల మంట: అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదని, వ్యాపారులు బియ్యం ధరలు అమాంతం పెంచి ప్రజలను దోచుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ లో నిర్ణీత ధరలను విస్మరించి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నా, పౌరసరఫరాలు మరియు విజిలెన్స్ అధికారులు కార్యాలయాలు దాటి తనిఖీలు చేయడం లేదని, తక్షణమే దగా చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.