పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించిన తండా కిరణాలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండతండాకు చెందిన సభవత్ శారద నరేష్ దంపతుల ముగ్గురు పిల్లలు ఉన్నత విద్యలో తమ ప్రతిభతో సత్తా చాటారు. పెద్ద కుమారుడు కుషాల్ జేఈఈ ద్వారా పుదుచ్చేరిలో రెండో కుమారుడు విశాల్ ఐఐఐటీ కాంచీపురంలో ప్రవేశం పొందారు. తాజాగా కుమార్తె అనూష నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కైవసం చేసుకుంది. పేదరికాన్ని జయించి ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ప్రతిష్ఠాత్మక సీట్లు సాధించడంతో గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ముక్తకంఠంతో అభినందించి ప్రశంసల వర్షం కురిపించారు.