తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి: పవన్‌ కల్యాణ్‌

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన వర్చువల్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై లక్ష్యాలను నెల, వారాల వారీగా విభజించాలన్నారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించి, ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.