తీవ్ర వాయుగుండం ముప్పు: బాపట్ల జిల్లా ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు

రిపోర్టర్: అశోక్ స్థలం: బాపట్ల

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం త్వరలోనే తుఫాన్గా మారనున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని Bapatla Police వెల్లడించారు. ఈ తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు అధికారుల సూచనలను పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.