తెలంగాణలో నేటి నుంచి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్ పరీక్షలు నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 24,986 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు 13 జిల్లాల్లో 41 ఆన్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2028 ఆగస్టు నాటికి అందరూ టెట్ అర్హత సాధించాలి.