'బురద రాజకీయం చేస్తున్నారు': సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభ వేదికగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే కుట్రపూరితంగా తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని, లేకుంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.