తెలంగాణ ఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు అత్యంత కీలకమైన గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఆర్టీసి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.