నాగ్‌పూర్‌లో కారు బీభత్సం: ఐదుగురికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: మహారాష్ట్ర
నాగ్‌పూర్‌లో తాగుడు మైకంలో ఓ మహిళ అతివేగంగా కారు నడుపుతూ ఫుట్‌పాత్ పై ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారితో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి కారును ధ్వంసం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు.