వయోవృద్ధుల వారోత్సవాల్లో యోగా డే
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా యోగా డే నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ వయోవృద్ధులతో కలిసి యోగాసనాలు వేసి, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వయోవృద్ధుల సహాయం కోసం 14567 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.