వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరిన ముప్పై కుటుంబాలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: అనకాపల్లి
నాతవరం మండలంలోని ములగపూడి గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ తమరాన లోవకృష్ణ ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. నర్సీపట్నం పట్టణ టీడీపీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.