వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం రేవంత్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ వేడుకలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా షర్మిల కుటుంబ సభ్యులకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యుల సందడి కనిపించింది.