శ్రీశైలంలో కూష్మాండ దేవిగా భ్రమరాంబిక: నవరాత్రి నాలుగో రోజు ప్రత్యేక పూజలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ శక్తి పీఠమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక దేవి కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టికర్తగా భావించే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.