ఈసీ కార్యాలయ ముట్టడికి యత్నం: రాహుల్ గాంధీ సహా నేతల అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఢిల్లీ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆకాశవాణి భవన్ వద్ద ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ముందస్తు అపాయింట్మెంట్ లేదంటూ రాహుల్ గాంధీతో పాటు ఐదుగురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.