రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బాపట్ల పోలీసుల ప్రత్యేక శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: బాపట్ల
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు Bapatla Police తెలిపారు. ప్రమాదాలు తగ్గాలి ప్రాణాలు నిలవాలి అనే సమున్నత ఉద్దేశంతో చేపట్టిన శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఫలితాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు మరింత పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.