విశాఖ, కర్నూలు మేయర్ పీఠాలను దక్కించుకున్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుందని, ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే కర్నూలు మేయర్గా విజయ ప్రత్యూష భారీ మెజార్టీతో గెలుపొందారని వారు పేర్కొన్నారు. ఈ రెండు నగరాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి.