అంతర్జాతీయ స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న విజయవాడ యువ క్రీడాకారుడు హాసిస్
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన 16 ఏళ్ల హాసిస్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. విజయవాడలో శిక్షణ పొందుతున్న ఈ యువ క్రీడాకారుడు, తైవాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించి సంచలనం సృష్టించాడు. ఫ్రీస్టైల్, సోలో డాన్స్, ఫిగర్ స్కేటింగ్‌లలో పసిడి పతకాలతో దూసుకుపోతున్న హాసిస్, రోజుకు 8 గంటల కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని పతాకస్థాయికి తీసుకెళ్తున్నాడు.