చేవెళ్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా పడి యువకుడు మృతి

రిపోర్టర్: రాము స్థలం: చేవెళ్ల

చేవెళ్ల మండలం పామెన గేటు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజ్కుమార్ గౌడ్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగిపోవడమే ప్రమాదానికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.