విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ బ్యాచ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపికైన ఇంటర్న్‌లకు నెలకు పది వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు అందజేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన భారతీయ పౌరులు దీనికి అర్హులు.