కూతురు జన్మదిన వేడుకలో పాఠశాలకు గ్రీన్ బోర్డు అందించిన సర్పంచ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దస్తురాబాద్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని పెర్కపల్లి ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ బోడకుంటి నరేష్ తన కుమార్తె హన్సిత జన్మదినం సందర్భంగా విద్యార్థుల చదువు కోసం గ్రీన్ బోర్డును అందజేశారు. స్వంత పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన, జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుంగూరి వెంకట్రాజం, చైర్మన్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు రాధిక తదితరులు పాల్గొని సర్పంచ్‌ను అభినందించారు.