నర్సీపట్నంను సమగ్రంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు చింతకాయల పద్మావతి హామీ
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై నాలుగు మరియు ముప్పై ఐదు వార్డులలో చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గెలిస్తే చేపల పెంపకం అభివృద్ధి తో పాటు పార్కును ఆధునికీకరిస్తానని తెలిపారు. కౌన్సిలర్ అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.