శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన పార్లమెంటరీ అధికార భాషా సబ్-కమిటీ
రిపోర్టర్: గోపి
స్థలం: నంద్యాల
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో పార్లమెంట్ అధికార భాషా మూడవ సబ్-కమిటీ సభ్యులు శుక్రవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఎంపీ సతీష్‌కుమార్ గౌతమ్ నేతృత్వంలోని ఈ బృందానికి దేవస్థానం ఈవో యం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఎంపీలు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.