అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పద్మనాభం పోలీసులు

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం జంక్షన్ సమీపంలో లభించిన అనాథ మృతదేహానికి పోలీసులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఎవరూ ముందుకు రాకపోవడంతో, సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి పర్యవేక్షణలో ఏఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవప్రదంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ గొప్ప కార్యాన్ని స్థానికులు అభినందించారు.