వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తన ప్రియురాలు ఎమిలీ రెడ్‌వుడ్‌ను వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సెప్టెంబర్ 4న వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్రికెట్ వర్గాలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.