జీతం నుంచి టీడీఎస్ మినహాయించి జమ చేయని వైనంపై ఉద్యోగికి అనుకూలంగా ఐటీఏటీ తీర్పు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Mumbai
ఉద్యోగి వేతనం నుంచి టీడీఎస్ కోత విధించి ప్రభుత్వానికి జమ చేయని యజమానుల తప్పిదానికి ఉద్యోగులను బాధ్యులను చేయలేమని ముంబైకి చెందిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్ర్యునల్ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముంబైకి చెందిన ఒక మహిళా ఐటీ ఉద్యోగి తన జీతంలో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కోతకు గురైనప్పటికీ, కంపెనీ ఆ మొత్తాన్ని జమ చేయకపోవడంతో రూ.3.36 లక్షల పన్ను డిమాండ్ నోటీసును ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు సమర్పించిన ఫారమ్-16, జీతం స్లిప్స్ వంటి ఆధారాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఆమెకు ఉపశమనం కల్పించింది.