గుర్రం జాషువా జయంతి వేడుకల్లో సత్తా చాటిన పసుపుల రాజశేఖర్

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాహిత్య వేడుకల్లో చిట్వేల్ ఉపాధ్యాయుడు పసుపుల రాజశేఖర్ కవితా పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉషోదయ ఫౌండేషన్, తెలుగు కళా రత్నాలు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.